69
డిసెంబరు 27న సింగరేణి ప్రభుత్వ బొగ్గు సంస్థలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే సింగరేణి కాలరీస్ లో ఎన్నికలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి అయితే అక్టోబర్ నెలలో జరగాల్సిన ఈ ఎన్నికలు అనేక తర్జనభర్జనల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి. దాంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ఆ సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27న నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంబంధిత కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 13 కార్మిక సంఘాలు పోటీపడుతున్నాయి.