ఈరోజు లోక్ సభలోకి ఆగంతకులు చొచ్చుకుని పోయిన సంఘటన విషయమై ఈ రోజు సాయంత్రం (13.12.2023) 7.30 నిమిషాలకు శాసనసభలోని స్పీకర్ గారి కార్యాలయంలో శాసనమండలి చైర్మెన్ మరియు శాసనసభ ప్రోటెం స్పీకర్ శ్రీ అక్బరుద్దీన్ ఒవైసి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై కూడ ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. శాసనసభ సమావేశాలు సజావుగా సాగాడానికి మూడెంచెల భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రొటెం స్పీకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేయబడ్డ పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మండలి చైర్మెన్, శాసనసభ ప్రొటెం స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, డి.జి.పి., హైదరాబాదు పోలీసు కమీషనర్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్లోన్నారు.
అత్యవసర సమావేశం….
64
previous post