ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోజుకో మాట పూటకో అబద్ధం మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని నియోజకవర్గ తెదేపా నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నాయకులు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ, ఒకప్పుడు రౌడీషీటర్ గా ఉన్న నీకు పరిటాల రవీంద్ర రాజకీయ భిక్ష పెట్టారన్న సంగతి మర్చిపోవద్దని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయకుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ 1995లో ఒక అనామకుడిని చంపి ఫ్యాక్షన్ నాయకుడిగా ముద్ర వేసుకున్నావని గుర్తు చేశారు. అప్పటినుంచి ఒక రౌడీషీటర్ గా నీకు గుర్తింపు ఉందన్నారు. గతంలో స్టీఫెన్ రవీంద్ర నిన్ను కొట్టిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని గోనుగుంట్ల విజయకుమార్ విమర్శించారు. మరోవైపు ఒక అనామకుడిగా ఉన్న నీకు అప్పట్లో పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చి భిక్ష పెట్టిన విషయం మర్చిపోవద్దన్నారు. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నావంటే ఎంత నీచానికి దిగజారావో అర్థం అవుతోందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి గానీ, పరిటాల రవి గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఓడిపోయిన తర్వాత కనీసం నెల రోజులు కూడా పార్టీలో ఉండలేకపోయావని… అదే పరిటాల రవీంద్ర తనను చంపుతారని తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారని విజయ్ కుమార్ అన్నారు. అలాంటి వ్యక్తి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావన్నారు. 2009, 2014, 19 ఎన్నికల్లో నీకు మేము సహకరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. మీ అసమర్ధతతో ఓడిపోతే అది పరిటాల రవి కుటుంబానికి ఎందుకు ఆపాదిస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు కేతిరెడ్డి తో కుమ్మక్కై 60:40 తో పనులు చేసుకుంటున్న విషయం అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేని దుస్థితి నీదన్నారు. పూటకో మాట మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను గందరగోళానికి గురి చేస్తున్నావని ఫైర్ అయ్యారు. మరోసారి పరిటాల రవి కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని గోనుగుంట్ల విజయ్ కుమార్ హెచ్చరించారు.
రోజుకో మాట పూటకో అబద్ధం….
91
previous post