బైరెడ్డిపల్లి మండలం చప్పిడి పల్లి పంచాయతీలోని మోట్లపల్లి, చంద్రమాకుల గడ్డ, జంగాల అగ్రహారం, గంగారాపూర్, చప్పిడిపల్లి, విరుపాక్ష పురం, మొరవిండ్లు, బాపలనత్తం గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వర్షం కురుస్తున్నా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు కూలంకుషంగా వివరించడం తో పాటు గతంలో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే కాలంలో అధికారం కట్టబెడితే ఖచ్చితంగా మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
వర్షం వచ్చిన ఆగని మాజీ మంత్రి పర్యటన…
145
previous post