టిడిపి నాయకులతో నిమ్మల కిష్టప్ప సమావేశం…

Ex MP Nimmala Kishtappa meeting with TDP leaders

Advertisements

&NewLine;<p>పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం టిడిపి నాయకులతో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సమావేశం ఏర్పాటు చేశారు&period; 2024 ఎన్నికలలో తనకు టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి తో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు&period; 26 జిల్లాలలో చేనేతకు సంబంధించిన కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో కనీసం మూడు నాలుగు చోట్ల అయినా కూడా చేనేతకు సంబంధించిన వారి టికెట్లు కేటాయించాలని కోరారు&period; తనకు పుట్టపర్తి నియోజకవర్గంలో టికెట్ కన్ఫామ్ చేస్తారని అనుకున్నాను కానీ ఎక్కడా ప్రకటించకపోవడంపై నిమ్మల కిష్టప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు&period; అందువల్లనే కార్యకర్తలతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశానని తనకు టికెట్ కేటాయించకపోతే భవిష్యత్తు కార్యచరణ కార్యకర్తలతోనే నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతానని అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కనీసం హిందూపురం పార్లమెంట్ టికెట్ అయినా తనకు కేటాయించాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని అన్నారు&period; అధిష్టానంతో మరొకసారి చర్చించి తాను నిర్ణయం తీసుకుంటానని&comma; 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు నేను అవినీతికి పాల్పడలేదని&comma; ఏ కార్యకర్తకైనా ఇబ్బంది కలిగితే తాను వెంట ఉండి వారి సమస్యను పరిష్కరించానని&comma; ఇన్ని సంవత్సరాల చరిత్రలో మొదటిసారి తన కొట్టి టికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉందని వాపోయారు&period; కేవలం డబ్బు ఉన్న నాయకులకే టికెట్లు కేటాయించడం అన్యాయమని అన్నారు&period; కార్యకర్తలు ఆవేశ పడకుండా ఉండాలని అన్నారు&period; టిడిపి అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోతే కార్యకర్తలతో మమేకమై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే దానికి సిద్ధమని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..