పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో నవ తెలంగాణ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో పుస్తకాల ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు అంతా మొబైల్స్ ని అతిగా ఉపయోగిస్తూ తమ తమ విద్యా సామర్థ్యాలను కోల్పోతున్నారు. మరియు తమ ప్రవర్తన విధానం మరి విపరీత పోకడలకు కారణం అవుతున్నది. కానీ పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు, జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఒక బాధ్యతాయుత పౌరునిగా రూపొందే అవకాశం ఉందన్నారు. అందువల్ల పిల్లలంతా పుస్తకాలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన చేసిన గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని, మరియు నవ తెలంగాణ పబ్లిషర్స్ బాధ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ పాల్గొన్నారు.
పుస్తకాల ప్రదర్శనశాల….
80
previous post