తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి తీవ్రత

Extreme cold shaking

Advertisements

&NewLine;<p>తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది&period; ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి&period; చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు&period; తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు&period; తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరుగుతుందన్నారు&period; రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు&period; ప్రజలు చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు&period; తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్మేస్తున్న పొగమంచు మధ్యాహ్నానికి కూడా వీడడంలేదు&period; దీంతో చాలాచోట్ల పట్ట పగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది&period; ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో చలి పంజాకు జనం వణికిపోతున్నారు&period; ఇటీవలి మిగ్జామ్ తుపాన్ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని అధికారులు చెబుతున్నారు&period; పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి&period; దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది&period; రోడ్లపై రెండు అడుగుల దూరంలో ఏమున్నదీ కనిపించని పరిస్థితి నెలకొంటోంది&period; ఉదయం&comma; సాయంత్రం వేళల్లో బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు&period; మరో రెండు మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.