సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈతకోట గ్రామంలో పనులు లేక కర్రి వారికి కుటుంబం వలసపోతున్న క్రమంలో రావులపాలెం వద్ద ఏమీ తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఓ బాలిక దారి చూపి కోప్పవరం గ్రామం చేర్చి ఇక్కడ భూమి సస్యశ్యామలం అయిందని ఇక్కడే పనులు చేసుకుంటూ జీవించండి అంటూ బాలిక అంతర్ధానమైంది. దీనితో ఆ కుటుంబం ఆ బాలికను దేవతగా కొలుస్తూ వస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఉన్న నాటి కర్రి వారి కుటుంబం సుసంపన్నంగా వేల సంఖ్య కు చేరుకున్నారు. అంతేకాకుండా అమ్మవారు మీరు పండించిన పంటలకు కాపలా కాస్తూ వారికి అండగా నిలుస్తుంది. నాటినుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి కర్రి వారి వంశీయులు సత్తెమ్మ తల్లి ఆడపడుచును కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు మిద్దె పైన కత్తిరి కుండను కిందకు దింపడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా దించిన కత్తెర కుండను సంతానం లేని మహిళల తలపై ఉంచితే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారికి మేక గొర్రె, గొర్రె పిల్లలు కానుకగా సమర్పిస్తారు. ఇక్కడ బలి నిషేధం కావడంతో అమ్మవారికి కానుకలుగా వచ్చిన గొర్రెపిల్లలను వేలం ద్వారా విక్రయిస్తారు. రెండవ రోజున ఊరి పొలిమేరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న నాగదేవతను పూజిస్తారు. ఈ పూజ కి వెళ్లే భక్తులు రకరకాల వేషాలు ధరించి అమ్మను కొలుస్తారు. పుట్ట నుండి గుడికి వచ్చిన క్రమంలో భక్తులు పూజారులను ఆలయంలోకి వెళ్లకుండ అడ్డు కుంటారు. దీంతో కోపోద్రిక్తులైన పూజారులు భక్తులపై జకులతో దండెత్తి బడిత పూజ చేస్తారు. ఇలా దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా మూడో రోజు ఆఖరి రోజైన సోమవారం జాతరలో చిత్ర విచిత్ర లతో అమ్మవార్ల జాతర్లు సాధారణంగా రాత్రి సమయాల్లో జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వెన్నెల లేకుండానే పట్టపగలు జరగడం ఓ విశేషం. అదేవిధంగా కోరికలు తీరిన భక్తులు సాధారణంగా తమకున్న సంపద నుండి కానుకలు సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులు జాతరలో ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేయాలి ఇలా భిక్షాటన చేయగా వచ్చిన బియ్యం, నగదు కానుకలను అమ్మవారికి సమర్పించాలి. దీంతో భక్తులు రకరకాల వేషాలు ధరించి జాతరలో భిక్షాటన చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ధనిక, పేద కుల మత విభేదాలు లేకుండా ప్రతి భక్తుడు భిక్షాటన చేస్తూ ఉండడంతో గ్రామమంతా బిచ్చగాళ్ళ మయంగా మారింది. ఈ వింతను చూసేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు రావడంతో గ్రామమంతా కిటకిటలాడింది. ఇలా భిక్షాటన చేసిన వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అదేవిధంగా కొన్ని బండ్ల పై వేషాలు కూడా ఆకట్టుకున్నాయి పుష్ప సినిమా స్పూఫ్ తో భక్తులు చేసిన నటన జాతరకు హైలెట్ గా నిలిచింది.
చిత్ర విచిత్రాల జాతర…
82
previous post