జగన్‌ నమ్మకద్రోహానికి బలైన రైతులు….

Thullur Deeksha

Advertisements

&NewLine;<p>అమరావతి ఉద్యమం కీలక దశకు చేరుకుందని&comma; అందరూ ఐక్యంగా నడిచి జగన్‌ను గద్దె దించాలని పలు రాజకీయ పార్టీలు&comma; ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు&period; వచ్చే మూడు నెలలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని&comma; అందరం పట్టుదలతో పనిచేసి అమరావతి కంటకులను ఇంటికి పంపిద్దామని ప్రతినబూనారు&period; సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతులు&comma; మహిళలకు సంఘీభావాన్ని ప్రకటించారు&period; అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు అయిన సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరంలో రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది&period; ఈ ఉద్యమానికి తాము వెన్నుదన్నుగా ఉంటామని వివిధ పార్టీలు&comma; సంఘాల నాయకులు హామీ ఇచ్చారు&period; రైతు గుండె పగిలి నేటికి నాలుగేళ్లు అయ్యిందంటూ జ్ఞాపకాలు స్మరించుకున్నారు&period; శిబిరంలో రైతు జెండాకు వందనం చేసి&comma; ఆకుపచ్చ బెలూన్లు ఎగురవేశారు&period; అనంతరం నిరసన దీక్షలు చేపట్టారు&period; ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలి&comma; జగన్‌ నమ్మకద్రోహానికి 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు&period; సకాలంలో వార్షిక కౌలు చెల్లించలేని&comma; చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్