బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా చిరుజల్లులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా,మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి, మిరప, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కొంతమేరకు పొట్ట దశలో ఉండగా ఆచేలు నెలవాలాయి కొంత శాతం కోసి కల్లాలు పై ఉండగా అకాల వర్షానికి వడ్లు మొలకలు వచ్చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట కూడా వివిధ దశల్లో ఉండగా చిన్న మొక్క నుంచి అడుగెత్తు మొక్క వరకు నీట మునిగి మొక్కజొన్న మొక్కలు చనిపోయి కొంత భాగం నేల వాలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షానికి మిర్చి చెట్లు సైతం నేలవాలాయి, పత్తి చెట్ల నుండి పత్తి తీసే తరుణంలో పత్తి తడిసి ముద్దయిపోవడంతో లోపలి గింజల సైతం మొలకలు వస్తాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ అకాల వర్షం వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో రైతన్నలు….
78
previous post