నంద్యాల జిల్లా డోన్ మండలం మరియు ప్యాపిలీ మండలం రైతుల కరువు కేక కార్యక్రమాన్ని డోన్ టీడీపీ ఇంచార్జ్, డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పిలుపు నివ్వడం జరిగింది. డోన్, ప్యాపిలి మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లతో మరియు ట్రాక్టర్ లు టిడిపి కార్యాలయానికి తరలివచ్చారు. టిడిపి కార్యాలయం నుంచి సమైక్యాంధ్ర కట్ట దగ్గర ర్యాలీగా తరలివచ్చి అక్కడి నుంచి డోన్ రెవెన్యూ డివిజన్ అధికారికి వెంకటరెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డోన్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత రెండు పర్యాయలుగా డోన్ మరియు ప్యాపిలి మండలం ప్రజలు కూడా నీకు ఓట్లు వేసి గెలిపించారు. బేతంచెర్ల రైతులు ఓట్లు వేస్తేనే నువ్వు గెలవలేదు, బుగ్గన్న నీవు ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం కరువు మండల ప్రకటించకపోతే డోన్ నియోజకవర్గం లో నీకు పుట్టగతులు ఉండవని ధర్మవరం సుబ్బారెడ్డి హెచ్చరించారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో నువ్వు ఓడిపోవడం సత్యమని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో సమావేశాలలో డోన్ మరియు ప్యాపిలీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రైతుల కరువు కేక…
97
previous post