ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి రైతుల వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంజనాపురం గ్రామం లోని గిరిజన రైతుల వద్ద తీసుకున్న భూములకు 30 లక్షలు ఇస్తామని చెప్పి 20 లక్షల రూపాయలే రైతుల ఎకౌంట్లో జమ చేశారని మిగతా నగదును రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఆర్డీవో సైతం రైతులు దగ్గర తీసుకున్న భూములకు న్యాయమైన రేటును ప్రకటిస్తామని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్య వద్ద ఎకరానికి 27 లక్షల రూపాయలు చొప్పున నగదు తీసుకొని రైతుల ఎకౌంట్లో 20 లక్షలు రూపాయలు జమ చేశారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మా ప్రాంతంలో ఎకరం 50 లక్షలు వరకు డిమాండ్ ఉందని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తమ భూములను ఇచ్చామని తమకు న్యాయమైన రేటు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు తమకు నష్టపరిహారం చెల్లించేంతవరకు ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు స్థానికులు పాల్గొన్నారు.
భూములు తీసుకొని… మాట మార్చేశారు…
88
previous post