పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కొని లేదని, ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి అని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పీవోకేని భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని అబ్దుల్లా అన్నారు. భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఫరూక్ అబ్దుల్లా ఈ కౌంటర్ ఇచ్చారు. కాగా కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రజలు తమంతట తాము భారత్‌లో భాగం కావాలనుకుంటున్నారని, పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని అన్నారు.
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.