ఘోర రోడ్డు ప్రమాదం…

DCM is the cause of the accident

Advertisements

&NewLine;<p>వారం సంతదినం కావడంతో కూరగాయలు&comma; సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది&period; ఇందులో 4 మంది అక్కడికక్కడే దుర్మరణం కాగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు&period; ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది&period; సంతదినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణలో లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు&period; మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలుపుతున్నారు&period; మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది&period; ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు&period; డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళుతుండగా చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీ కొన్నట్టు స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు&period; అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు&period; ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period; ప్రస్తుతం మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి&period; ఆగ్రహించిన స్థానికులు డీసీఎం అద్దాలు పగల కొట్టి ఆందోళన చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.