తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం

Advertisements

<p>ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన పైనుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు&period; తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిగా పేరున్న రాజన్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది&period;<&sol;p>&NewLine;<p>తన డ్రైవర్‌తో కలిసి కారులో వంతెన వద్దకు చేరుకున్న రాజన్‌&period;&period;కాసేపు వాకింగ్‌ చేసి వస్తానని చెప్పి వెళ్లి నదిలోకి దూకేశారు&period; విషయం తెలుసుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు&period; నదిలో నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసి&comma; పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఆయన అప్పుల బాధతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది&period; అడయార్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period; నిర్మాతగా&comma; దర్శకుడిగా&comma; నటుడిగా సుపరిచితుడైన రాజన్ మృతి పట్ల సినీ రంగ ప్రముఖులు పలువురు సంతాపం ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>1983లో బ్రమ్మచారిగళ్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజన్ &period;&period; ఆవళ్ పాపం&comma; నినైక్కాద నాళిలై తదితర చిత్రాలను నిర్మించారు&period; నటనపై ఆసక్తితో 18 చిత్రాల్లో నటించారు&period; శరత్ కుమార్&comma; నిళల్గళ్ రవి నటించిన నమ్మ ఊరు మరియమ్మ&comma; ఉణర్చిగళ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు&period; 1991లో విడుదలైన తంగమాన తంగచ్చి&comma; చిన్నవూవై కిళ్లాదే చిత్రాలకు కథా రచయితగా కూడా పని చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..