మంథని (manthani) పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ లో ప్రమాదవషాత్తు అగ్నిప్రమాదం (Fire Accident) సంబవించి ఆస్తి నష్టం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని సి ఆర్ కే అపార్ట్మెంట్స్ లో హోలీ పండగవేళ అపశృతి నెలకొంది. సోమవారం సాయంత్రం సి ఆర్ కే అపార్ట్మెంట్స్ లోని మూడవ అంతస్తులో ఉన్న 306 ఫ్లాట్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఆస్తినష్టం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో నుండి పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న మహిళ వెంటనే బయటకు వచ్చి పక్కవారికి చెప్పి తిరిగి రావడంతోనే బెడ్ రూమ్ లో మంటలు వ్యాపించాయి.
ఆ సమయంలో ఇంటి యజమాని సూర్య ప్రకాష్ రావు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఉన్న అయన భార్య ప్రభుత్వ టీచర్ చాకచక్యంగా వ్యవహరించి బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది, దీంతో ప్రాణాపాయం తప్పింది. మూడవ ఫ్లోర్ 306 ఫ్లాట్ లో సాయంత్రం సమయంలో కిటికీ పక్కన ఉన్న విద్యుత్ బోర్డ్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి పక్కనే ఉన్న పరదాలకు మంటలు అంటుకొని గదంతా వ్యాపించాయి. బెడ్లు, ఫర్నిచర్, బీరువా మంటల్లో కాలిపోయాయి. బీరువాలో ఉన్న నగదు, బంగారం, విలువైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదం జరగడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మంథని ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పి వేశారు. పండగ పూట ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వెల్లడించారు.
ఇది చదవండి: ఆలయ అర్చకులపై వైసీపీ నేత దాడి
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి