103
ప్రజల హృదయాల్లో నుంచి జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కొనియాడారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రంగా చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ. ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి రంగా మాత్రమేనని ప్రసాద్ అన్నారు. పేద ప్రజల కోసం, ముఠా కార్మిక సంఘాల కోసం రంగా ఎనలేని కృషి చేశారని తెలిపారు. తెలుగు వారు ఉన్నంతకాలం రంగా చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. కొంతమంది నాయకులు ఆస్తులు సంపాదించుకుంటారు కానీ, రంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజల అభిమానాన్ని సంపాదించారని బోడె ప్రసాద్ కితాబునిచ్చారు.