వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంధర్బంగా కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు. రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కుర సాల సత్యనారాయణ, కరప జెడ్పీటీసీ సభ్యులు యళ్ళ సుబ్బారావు, తిమ్మాపురం సర్పంచ్ బేజావాడ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి, వై.ఎస్.అర్ విగ్రహానికి పుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియా తో మాట్లాడుతూ వైసిపి 14 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ నియోజకవర్గం లో పెద వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద సుమారు 10 లక్షల చెక్ లను పంపిణీ చేశామని, పెదల అభ్యున్నతికి వైసిపి ఎల్లపుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలు, అసాయలు అంత పెద వారి కోసమే అని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం…
80
previous post