ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం. నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్(Election Notification)ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నేడు పదకొండు గంటల నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇస్తారు.
ఇది చదవండి: డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..
నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి