జి శ్రీనివాస్ నాయుడు నామినేషన్ (G. Srinivas Naidu Nomination):
2024 సాధారణ ఎన్నికలలో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను జి శ్రీనివాస్ నాయుడు (G. Srinivas Naidu) దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి
గణేష్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరి పాటిమీద గణేష్ చౌక్ సెంటర్ నందు శ్రీ విగ్నేశ్వర స్వామి, కుమారస్వామి వార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్, పెదగాంధీ బొమ్మ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లు మీదుగా ఆర్ఓ కార్యాలయానికి చేరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తీన్మార్ డప్పులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో సందడి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో నిడదవోలును ఎంతో అభివృద్ధి చేశారని అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలు లబ్ధి పొందారని అభివృద్ధిని చూసి ప్రజలందరూ ఓట్లు వేస్తారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి. రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శ్రీనివాస్ నాయుడు కి నిడదవోలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అందర్నీ గెలిపిస్తాయని, మళ్లీ రాబోయే ప్రభుత్వం వైసిపి ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, నిడదవోలు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు నీ అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఆయన అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి