సిద్దిపేట జిల్లా హుస్నాబాద్.. మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛత కార్యక్రమాన్ని వృత్తిరీత్యా, బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్, అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛత అవార్డులు రావడంలో కృషిచేసిన పారిశుద్ధ్య కార్మికులను నూతన వస్త్రాలు, శాలువాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలందరూ కూడా భాగస్వాములైతే పారిశుద్ధ కార్మికులకు సహకరించి వారిని గౌరవించినట్లేనని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలో కాలుష్య నివారణ, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణతో ప్రజలందరి ఆరోగ్యం కోసం మునుముందు అవసరమైన కార్యక్రమాలు తీసుకుందామని వెల్లడించారు. మహాత్మా గాంధీ ఇచ్చిన శాంతి, గ్రామాల అభివృద్ధి, సర్వమత సమ్మేళనలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని అన్నారు.
గాంధీ చిత్రపటానికి పూలమాలలు..
70
previous post