అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గo మామిడికుదురు మండలం లో పాశర్లపూడి 43వ నెంబర్ బావిలో GCSK క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న పైప్ లైన్ నుండి మామిడికుదురు వద్ద బయటికి వస్తున్న గ్యాస్ ను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురైవుతున్నారు. ఇంతవరకు ఈ విషయంపై ONGC అధికారులు స్పందించలేదు. మామిడికుదురు మండలంలో గతంలో తరచూ ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికి తూ..తూ మంత్రంగానే ఓఎన్జిసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఓఎన్జిసి అధికారులు చర్యలు తీసుకొవాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 2014లో జరిగిన ప్రమాదానికి ఇప్పటివరకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదని నగరం గ్రామంలో తాగునీరు, విద్య, వైద్యం, ఒక కార్పొరేట్ ఆసుపత్రి, 24 గంటలు అందుబాటులో అంబులెన్స్ లు ఉంటాయని వాగ్దానాలు చేసిన ongc అధికారులు ఇప్పటివరకు అటువైపుగా చూడలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్యాస్ పైప్ లైన్ లీక్…భయాందోళనలో ప్రజలు
78
previous post