రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పాలనను చూసి ప్రజలు మరొకసారి అవకాశం కల్పించాలని నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వైసిపి నర్సాపురం శాసనసభ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామంలో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిని గూడూరి ఉమాబాలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి ఫలాలను అందించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని అటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు మరొకసారి మద్దతు పలకాలని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించి ఒక బీసీ మహిళలను నాకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని జగనన్న రాష్ట్రంలో అందించిన ప్రజా పరిపాలనకు రాష్ట్రంలోని ప్రజలందరూ మరొకసారి అవకాశం కల్పించాలని గుడూరి ఉమా బాల అన్నారు.
మరోసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి…
77
previous post