పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పడింది మిచౌంగ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటిన పంట పొలాలలో నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఉపయోగించే ఐరన్ పడవలు ఇప్పుడు పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ లో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు రైతులు వరి కోసి వరి పనలను పడవల ద్వారా వడ్డీకి చేరుస్తున్నారని పంట పొలాల నుండి నీరు బయటకు వెళ్లకపోవడానికి వైసీపీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యమని కారణమని రైతులు మండిపడుతున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలు ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదు- కోళ్ల నాగేశ్వరరావు
76
previous post