రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చెందిప్ప గ్రామ పరిధిలో ఉన్న 124 సర్వే నంబర్ గల 8.22 ఎకరాల భూమిని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తులు మొత్తం 7.22 ఎకరాలా భూమిని తమ పేరు మీద పట్ట భుమిగా మార్చి జెసిబి లు తీసుక వచ్చి సాప్ చేపిస్తున్న క్రమంలో గ్రామస్థులు తెలుసుకోని అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భూమి ఎప్పుడు సాగులో లేదు ఇది ఒక కొండ ప్రాంతంగా మాత్రమే ఉండేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ కొండపైన ఒక మసీదు మరియు కొండ కింది ప్రాంతంలో ముస్లింల స్మశానవాటిక ఉండేది. ఇట్టి భూమిపై కన్నేసిన భూ బకాసురులు 2016 నుంచి పట్టా భూమిగా మార్చుకొని కబ్జాలకు తీసుకునే ఉద్దేశంతో జెసిబిలు పెట్టి సాప్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ యొక్క భూమి 2016 వరకు లావని పట్టాగా ఉండేదని ఇందులో కొంత భూమి అనగా ఒక ఎకరం వరకు కడమంచి వారి పై ఉన్నట్టు తెలుస్తోంది. కడమంచి వారిపై ఉన్న భూమి లావిని పట్టగాను చూపిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మార్వో ను అడగగా తను లేనని తర్వాత కలుస్తానని దాటవేస్తున్నారని అక్కడి ప్రజలు తెలిపారు.
ప్రభుత్వ భూమి కబ్జా…అడ్డుకున్న గ్రామ ప్రజలు
149
previous post