ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Karnati Rambabu

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భముగా దుర్గ గుడి ఘాట్ రోడ్ లోని ఓం- టర్నింగ్ వద్ద దేవస్థానము వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమమునకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు&comma; కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు విచ్చేశారు&period; అనంతరం వీరు శ్రీ అమ్మవారి&comma; శ్రీ రాముల వారి&comma; భారతమాత&comma; జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు ఆలయ అర్చకులు&comma; వేదపండితులు&comma; వేద విద్యార్థుల వేద మంత్రోచ్చరణలు&comma; మంగళ వాయిద్యముల నడుమ పూలు&comma; పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు&period; తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు SPF సిబ్బంది&comma; హోం గార్డ్స్ మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనము అందుకుని&comma; జెండా వందనము జేశారు&period; ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది&comma; భక్తులు పాల్గొని జాతీయ గీతములు ఆలపించారు&period; తదనంతరము గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి&comma; అమ్మవారి స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి చైర్మన్&comma; కార్యనిర్వాహనాధికారి ప్రసంగించి అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవములు జరుపుకోవడం అందరి పూర్వ జన్మ ఫలం అని అన్నారు&period; అనంతరం చిన్నారులకు&comma; దేవస్థానము సిబ్బందికి&comma; spf వారికి&comma; భక్తులకు చైర్మన్ గారు&comma; కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి లడ్డు ప్రసాదం&comma; చాక్లెట్లు పంచిపెట్టారు&period; ఈ కార్యక్రమములో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు&comma; వైదిక సిబ్బంది&comma; వేదపండితులు&comma; ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరులు&comma; సహాయ కార్యనిర్వహణాధికారులు&comma; పొలిసు సిబ్బంది&comma; ఇంజినీరింగ్ సిబ్బంది&comma; సెక్యూరిటీ సిబ్బంది&comma; మరియు ఇతర దేవస్థాన సిబ్బంది&comma; భక్తులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..