విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజులపాటు సాగే ఉత్సవాల్లో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భారతావనిలో వైదికపరమైన తంత్ర విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చనా ప్రత్యేకమైనదని చెప్పారు. అమ్మవారి కృప తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు సుఖ సంతోషాలను, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు చేపట్టామని తెలియజేశారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.