నక్కపల్లి మండలం, రాజియ్యపేట పేట గ్రామంలో మత్స్యకారులను మోసం చేసి తన పబ్బం గడుపుకుని మాకు ద్రోహం చేశాడని జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పై మత్స్యకారులు నిప్పులు కురిపించారు. ఈ రోజు మాకు న్యాయం జరగాలని గ్రామంలో చేపల గంపలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. హెటేరో పరిశ్రమ నుండి వెలువడుతున్న రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలోకి పంపేందుకు నిర్మిస్తున్న పైపు లైను మత్స్యకారులు అడ్డుకుని ఆపించారు. తిరిగి దానిని నిర్మాణం జరగకుండా మత్స్యకారులు అందరూ 700 రోజులు మహ శాంతియుత ధర్నా చేశారు. ధర్నాకు రాజకీయ నాయకులు, పెద్దలు కూడా మద్దతు తెలిపారు. కానీ జనసేన పార్టీ రస్త్ర కార్యదర్శి మా ధర్నాకు పూర్తి మద్దతు ఇచ్చి హెటేరో యాజమాన్యంతో మాట్లాడి, మీకు న్యాయం చేస్తానని, మీ డిమాండ్లను హెటేరో యాజమాన్యం ఒప్పుకోక పోయిన, ఒప్పుకుని హామీ ఇచ్చి నెరవేర్చకపోయిన నేను మీతో మీ డిమాండులను నెరవేర్చే వరకు ఆమరణనిరాహారదీక్ష కూడా నేను చేస్తానని మాట ఇచ్చారు. శివదత్ మాటమీద నమ్మకంతో మా ధర్నాను విరమించుకున్నాము. కానీ విరమించుకుని 5 నెలలు దాటినా హెటేరో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని శివదత్ ను అనేక సార్లు అడిగిన మాట మారుస్తున్నారు. తప్ప మాకు న్యాయం చేయలేదు అంటూ మత్స్యకారులు శివదత్ పై మండిపడ్డారు.
700 రోజుల మహా శాంతియుత ధర్నా…
88