పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం కొరకు తమ ఆరోగ్యాలను పాడు చేసుకుని విధుల నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనంగా 26000 చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పారిశుద్ధ్య కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ నిత్యవసర ధరలు పెరుగుతుంటే చాలీచాలని వేతనాలతో పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం న్యాయపరమైన తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఔట్సోర్సింగ్ కార్మికుల అర్ధ నగ్న ప్రదర్శన..
84
previous post