లోక కళ్యాణార్ధం యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నిర్వహించిన హరిహర మహా యజ్ఞానికి ప్రజలు పోటెత్తారు. కార్తీకమాసం పర్వదినాలను పురస్కరించుకొని ప్రంపంచంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఈ యజ్ఞం నిర్వహించినట్లు అశోక్ తెలిపారు. ఉదయం వేకువ జామునుండి ప్రారంభమైన ఈ మహా యజ్ఞం గొల్లపల్లి శ్రీనివాస అశోక్ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హరిహర యజ్ఞం శివపార్వతుల కళ్యాణం, మహా మృత్యుంజయ హోమం, లక్ష బిల్వార్చన, రుద్రాక్షలతో అభిషేకం ఋత్విక్కులు నియమ నిష్టలతో అశోక్ దంపతులచే చేయించారు. యానాంకు చెందిన మహిళలచే లలితా సహస్రనామ కార్యక్రమం, గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. యానాం ప్రజలు, వరదలు, తుఫానులు వంటి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటినుండి పరమశివుడు యానాం ప్రజలందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అశోక్ తెలియచేసారు. సాయంత్రం గోదావరి మాతకు అంగరంగ వైభవంగా పంచహారతులు ఇవ్వనున్నారు.
హరిహర మహా యజ్ఞం….
68
previous post