70
భద్రాద్రి సీతారామ స్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన హరీష్ రావుతో ఆటో డ్రైవర్లు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డున పడ్డామని బాధ పడ్డారు. తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావును కోరారు. దీంతో హరీష్ రావు స్పందించి ఎవరు ఆందోళన చెందవద్దని, న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారికి హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా చేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేసే దాకా పోరాటం చేస్తామన్నారు.