73
తెలంగాణలో ఇక ప్రజా పాలన మొదలైందా? పరిపాలన విషయంలో రేవంత్ తనదైన ముద్రవేస్తున్నారా? అంటే పరిస్థతులు అవుననే చెబుతున్నాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు తీసుకోగానే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు అందనంత దూరంగా ఉన్న ప్రగతి భవన్ పైనే రేవంత్ గురి పెట్టారు. సీఎం నివాసం ముందు కట్టుదిట్టంగా నిర్మించిన కంచెను ప్రమాణస్వీకారం చేసే లోపలే బద్దలు కొట్టించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామన్నది చెప్పకనే చెప్పారు. ఫైళ్లపై తొలి, మలి సంతకాల విషయలోనూ ప్రత్యేకత కనబరిచారు.