ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడి నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాలు చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈరోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నోటిసులకు కవిత గైర్హాజరవుతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500లకు సిలిండర్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.