భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

CPM State Secretary

Advertisements

&NewLine;<p>తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు&period; భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను&comma;జగనన్న కాలనీలను పరిశీలించారు&period; తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు&period; వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీటిలోనే… పంట నాని ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు&period; ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు&period; నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు&period; తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సిఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నాం అనడం సరికాదనీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి రైతుల పరిస్తితి తెలుసుకోవాలన్నారు&period; తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు à°§à°° ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు&period; మరోవైపు వర్షపు నీటిని జగన్న కాలనీలు అధ్వానంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా మారాయన్నారు&period; సరైన సౌకర్యాలు లేక కాలనీల్లో ఉంటున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు&period;తుఫాను ప్రభావంతో వాణిజ్య పంటలు దెబ్బతిని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు&period;అరటి తోటలు గాలుల ప్రభావానికి నేల వాలయి &period;&period;కంద&comma;పసుపు పంటలు వర్షపు నీటితో నాని రైతులకు నష్టం వాటిల్లింది&period;చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.