నవాజ్ షరీఫ్ కు హైకోర్టు క్లీన్ చిట్….

Former Prime Minister of Pakistan Nawaz Sharif

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారీ ఊరట లభించింది&period; రెండు కేసుల్లో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది&period; 2018లో ఈ రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్ ను అవినీతి నిరోధక కోర్టు దోషిగా పేర్కొంది&period; అవెన్ ఫీల్డ్ స్థిరాస్తుల కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం&comma; అల్ అజీజియా ఉక్కు పరిశ్రమ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది&period; అయితే&comma; అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలంటూ 2019లో లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు&period; నాలుగేళ్ల పాటు లండన్ లో ప్రవాసం గడిపిన ఆయన స్వయం ప్రకటిత ప్రవాసం నుంచి ఇటీవలే బయటికి వచ్చారు&period; అక్టోబరులో పాక్ గడ్డపై అడుగుపెట్టారు&period; త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యంగా సంతరించుకుంది&period; షరీఫ్ తిరిగి రావడంతో ఆయన సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది&period; ఇప్పుడు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో పీఎంఎల్-ఎన్ నేతలు&comma; కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..