మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో భువనేశ్వర్ నుండి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ లో 9 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు మధిర ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రైల్వే జిఆర్పి పోలీసులతో కలిసి కోణార్క్ రైలులో తనిఖీలు నిర్వహించగా, ప్యాకెట్లు గా ఏర్పాటుచేసి తరలిస్తున్న బ్యాగులను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈసారి కు సంబంధించి నిందితులు ఎవరిని గుర్తించడం జరగలేదని తెలిపారు. నిషేధిత మత్తు పదార్ధాలు గంజాయి తదితర వస్తువుల సరఫరా వినియోగంపై కఠినంగా వ్యవహరించనున్నామని ప్రజలు వీటిపై తమకు తెలిసిన సమాచారాన్ని తమకు అందించి గంజాయి రహిత ప్రాంతంగా మధిర సర్కిల్ గుర్తించే చర్యల్లో తోడ్పాటునoదించాలని కోరారు. గంజాయి స్వాధీనం చేసుకున్న టీం లో ఎక్సైజ్ ఎస్సై సి జనార్దన్ రెడ్డి, ముస్తఫా గోపి రజాక్, నాగరాజు తదితరులు ఉన్నారని సిఐ తెలిపారు.
98
previous post