పారిశుధ్య కార్మికులకు అండగా నేనుంటా…

Chamarti Jagan Mohan Raju

Advertisements

&NewLine;<p>పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే టిడిపి లక్ష్యమని&comma; వారికి తాము అన్ని విధాల అండగా నిలబడతామని రాజంపేట తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు&period; పండుగ సమీపిస్తున్న వేళ పారిశుద్ధ కార్మికులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయిన ఆయన తన కార్యాలయంలో 95 మంది పారిశుధ్య కార్మికులకు నాణ్యమైన 25 కిలోల బియ్యం బస్తాలుతో పాటు టీ షర్టులు పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మరచిపోయారని అన్నారు&period; కార్మికులకు అండగా నిలబడిన ఘనత టిడిపిదేనని&comma; గతంలో కూడా చంద్రబాబు నాయుడు పాలనలో వారికి రూ 6 వేలు వేతనం పెంచడం జరిగిందని గుర్తు చేశారు&period; జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కార్మికులు గత ఎనిమిది రోజులుగా పండుగ&comma; పబ్బం అనుకోకుండా రోడ్డులెక్కి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీస చలనం కూడా లేదని మండిపడ్డారు&period; రాష్ట్రం సుందరంగా ఉండాలన్నా&comma; ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రధాన భూనిత పోషించేది పారిశుధ్య కార్మికులేనని&comma; వారి కష్టాలు&comma; న్యాయమైన డిమాండ్లు పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు&period; రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని&comma; తమ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు&period; ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు&comma; కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.