విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామములో శ్రీ సీతారామచంద్రస్వాముల హనుమంతుల విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం, ప్రతిష్ట మహోత్సవం కన్నులపండుగా జరిగింది. ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట కన్నులపండుగగా జరిగింది. గ్రామము లో ఉన్న అడపడుచులతో గ్రామములో పండుగ వాతావరణం ఏర్పడింది. ఎలక్షన్ దగ్గరలో ఉండటంతో అభ్యర్థులందరూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. బీఎస్పీ పార్టీ అభ్యర్థి లక్కేపోగు వందన కుమార్ మాట్లాడుతూ గ్రామములో ఉన్న ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆలయ ప్రదక్షణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు దారా మారేశ్వరావు ,కుక్కడపు కృష్ణార్జునరావు,పిల్లివట్ల వెంకటేశ్వరరావు,వనమా మాధవరావు, గంట వెంకటాచారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జై శ్రీరామ్ అంటూ మారుమ్రోగిన నూతిపాడు గ్రామం…
109
previous post