ఆ రోజు పోలీసులకు దొరికితే అంతే..!

Traffic police

Advertisements

&NewLine;<p>నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు&comma; ప్రమాదాలు జరగకుండా 31 వ తేదీ రాత్రి 8&period;00 గంటల నుండి జనవరి 01 వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం 4 మల్లంపేట్ &&num;8211&semi; శంభీపూర్ ఎగ్జిట్ 5 దుండిగల్ మూసి వేస్తున్నామని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏ&period;సి&period;పి శ్రీనివాస్ తెలిపారు&period; ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసిపి అన్నారు&period; శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు&comma; వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు&period; ఒక వేళ మద్యం సేవించి&comma; హెల్మెట్ లేకుండా&comma; నియమ నిబంధనలు పాటించకపోతే వాహన దారల పై చట్టపరమైన&comma; న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు&period; ఒకరు వాహనాలు అజాగ్రత్త నడిపితే&comma; ఒకరు వల్ల ఇంకొకరి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని అన్నారు&period; ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందితే సదరు వ్యక్తి కుటుంబం రోడ్డుపై పడుతుందని&comma; ఒకరి నిర్లక్ష్యంతో మరొకరు ఇబ్బందుల పాలవుతారని ఎసిపి చెప్పుకొచ్చారు&period; డిసెంబర్ 31 రోజున 12 బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు ఎ&period;సి&period;పి మీడియా సమావేశంలో వెల్లడించారు&period; ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని&comma; మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని ఆయన హెచ్చరించారు&period; అర్ధరాత్రి ఎవరైనా కేకులు కట్ చేసిన&comma; టపాసులు&sol; బాణసంచా పేల్చిన&comma; బైక్ ర్యాలీ లు చేసిన సి&period;సి కెమెరా ద్వారా వారిని కనుగొని కేసులు నమోదుచేస్తామని అన్నారు&period; సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సి&period;ఐ వెంకట్ రెడ్డి&comma; యస్&period; ఐ లు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్