నేరాలకు పాల్పడితే ఉక్కుపాదం…..

If you commit crimes, you will be punished.

Advertisements

&NewLine;<p>చట్టాన్ని అతిక్రమించి నేరాలకు&comma; అక్రమాలకూ పాల్పడే వారి పై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు&period; సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి లో డిఎస్పి కార్యాలయాన్ని&comma; ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు డి ఐ జి సెంథిల్ కుమార్&comma; కలెక్టర్ గిరిషా పి ఎస్&comma; స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు&period; ముందుగా వారు పోలీస్ కమాండో గౌరవ వందనం స్వీకరించారు&period; తర్వాత పోలీసు సిబ్బంది&comma; ఇతరులు ఫ్లవర్ బుక్కేలతో పాటు శాలువాలతో సన్మానించి వారికీ ఘన స్వాగతం పలికారు&period; అనంతరం డిఎస్పి కార్యాలయం&comma; ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లు నిర్మాణాలను వేగంగా పుర్తియ్యేందుకు సహకరించిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు&period; అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా&comma; చట్టబద్దంగా తాము పని చేస్తున్నామని మాకు అన్ని రాజకీయ పార్టిలు సమానమేనని ఎ పార్టీ పట్ల వివక్షత చూపమని స్పష్టం చేశారు&period; ప్రజలకు మరింత చేరువై వారికీ మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు&period; ఇటివల వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన పట్ల పూర్తిగా విచారణ చేపట్టామని దోషులు ఎవ్వరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు&period; రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లా పోలీసు సిబ్బంది కొరత లేకుండా సన్నాహాలు చేస్తున్నామని వివరించారు&period; త్వరలోనే పోలీసు నియామకాలు చేపట్టి పోలీసు సిబ్బంది కొరత లేకుండా చేస్తామని తెలిపారు&period; గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్యా తగ్గు ముఖం పట్టిందని తెలియజేశారు&period; దిశా యాప్ ని సుమారు కోటి యాబై లక్షల మంది తమ సెల్ ఫోన్ లలో నమోదు చేసుకోన్నరన్నారు&period; దిని ద్వారా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారి పై క్షణికకాలంలోనే సమాచారం అందుతుందని&comma; అలాంటి కామందులు&comma; ఆకతాయిలకు దండన తప్పదని హెచ్చరించారు&period; ఇటివల కాలంలో అవగాహనా లోపంతో కుటుంబ కలహాలు ఎక్కువ అయ్యాయని భార్యాభర్తలు&comma; కుటుంబ సభ్యులకు తగిన రీతిలో కౌన్సలింగ్ ఇచ్చి వారి కాపురాలు సజావుగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు&period; అజాగ్రత్తల కారణంగానే&comma; ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి యువకులు అతివేగంగా వాహనాలు నడుపుతుండడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని&comma; రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అన్నిరకాల చర్యలతో అడ్డుకట్ట వేస్తున్నామని వివరించారు&period; రాయచోటి పట్టణంలో మరొక పోలీసు స్టేషన్ కు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తమను కోరారన్నారు&period; అందుకు త్వరలోనే పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్