బియ్యపు గింజలతో రేవంత్ చిత్రపటం

Image of Revanth with rice grains

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ జీవితాల్లో మార్పు వస్తుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు&period; అదే ఆకాంక్షతో ఓ కాంట్రాక్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ చిత్రపటాన్ని రూపొందించాడు&period; హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ సర్వ శిక్ష అభియాన్ కింద ఎల్కతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నారు&period; ముఖ్యమంత్రి రేవంత్ పై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించానని రాజ్ కుమార్ తెలిపారు&period; గతంలో కూడా ఎందరో మహనీయుల చిత్రపటాలను ఇదే విధంగా రూపొందించానని పేర్కొన్నారు&period; 10 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చాలీచాలని జీతంతో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్నానని&comma; ముఖ్యమంత్రి రేవంత్ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరాడు&period; రాజ్ కుమార్ రూపొందించిన చిత్రపటం పాఠశాలలో పిల్లలను&comma; ఉపాధ్యాయులను ఎంతగానో ఆకర్షిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..