లోక్‌సభ నిరవధిక వాయిదా

Indefinite adjournment of Lok Sabha

Advertisements

&NewLine;<p>లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది&period; షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది&period; పార్లమెంటు వీతాకాల సమావేశాలు ఈ నెల 4à°¨ ప్రారంభమయ్యాయి&period; గురువారం సభ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు&comma; ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది&period; అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు&period; ఈ నెల 13à°¨ పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసింది&period; ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఆందోళన చేశాయి&period; భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా హోంమంత్రి అమిత్ à°·à°¾ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనలు తెలిపాయి&period; ఈ క్రమంలో లోక్‌సభతో పాటుగా రాజ్యసభలో కలిపి మొత్తం 143 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు&period; పార్లమెంటు చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి&period; కాగా ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించింది&period; కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు&comma; జమ్మూ&comma; కశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు&comma; చీఫ్ ఎలక్షన్ కమిషనర్&comma; కమిషనర్ల నియామకం బిల్లు తదితర బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది&period; అలాగే టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై సస్పెండ్ సైతం విధించారు&period; డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ఆమోదించిన తర్వాత మహువాను లోక్‌సభ బహిష్కరించింది&period; ముందు నిర్ణయించిన ప్రకారం లోక్‌సభ ఈ నెల 22 వరకు జరగాల్సి ఉంది&period; అయితే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.