కార్మికుల నిరవధిక సమ్మె…

Indefinite strike of workers...

Advertisements

&NewLine;<p>మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్&comma; సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు&period; యూనియన్ అధ్యక్ష&comma; కార్యదర్శులు సూరి&comma; రామాంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని&comma; ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని&comma; కరోనా కష్టకాలంలో పని చేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలని&comma; పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని&comma; ట్రెజరీ ద్వారా 010 ప్రకారంగా వేతనాలు అమలు చేయాలని&comma; రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతి ప్రకారం ఓ పి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు&period; తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు&period; కార్మికుల సమ్మె చేయడంతో మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే నిలబడిపోయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..