కరీంనగర్ కమీషనరేట్ రూరల్ డివిజన్ లో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ (LMD Police station) ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి (Abhishek Mohanty) ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసారు. పోలీస్ అధికారులంతా నిజాయితీగా, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలను ప్రతి ఒక్కరు విధిగా సందర్శించి ఏమైనా లోటు ఉన్నట్లయితే వెంటనే పై అధికారులకు తెలపాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లతో పాటుగా గతంలో ఎన్నికల సమయం లో జరిగిన గొడవల ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇప్పటికే బైండోవర్ కాబడి గడువు ముగిసిన వారిని తిరిగి బైండ్ ఓవర్ చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిని సైతం గుర్తించి వారిని కూడా బైండ్ ఓవర్ చేయాలన్నారు. స్టేషన్ పరిధిలోగల సమస్యాత్మక , సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో తిమ్మాపూర్ ఇన్స్పెక్టర్ స్వామి, ఎల్ ఎం డి ఎస్సై చేరాలు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది చదవండి: నీదారే నీ కథ మూవీ టీజర్ లాంచ్ ఘనంగా జరిగింది
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి