సోషల్ మీడియా (Social Media) :
జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా (Social Media)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఓ ఆంగ్ల దినపత్రికను చూస్తున్నప్పటి ఫొటో పంచుకున్నారు. ఆ పేపర్లో మోదీ స్పీచ్ తాలూకు బ్యానర్ ఐటమ్ ఉంది. ‘ఇది మోదీ హామీ… అవినీతికి పాల్పడిన వారు జైలుకే’ అన్నది ఆ పేపర్లోని కథనం శీర్షిక. దీనిపై పవన్ స్పందిస్తూ… “విజయవాడ ఎయిర్ పోర్టులో విమానం కోసం వేచిచూస్తుండగా ప్రత్యేకించి ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ గౌరవనీయ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఇది చదవండి : జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి
ప్రియమైన వైసీపీ… ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే… అది ఎన్నికలకు ముందు జరుగుతుందా, లేక ఎన్నికలు అయిపోయాక జరుగుతుందా? వైసీపీ సర్కారును సాగనంపి, బీజేపీ-టీడీపీ-జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు” అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జనసేనాని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..