మెక్సికోలో భారీ భూకంపం.

Earthquakes

Advertisements

<p>మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది&period; గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది&period; రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7&period;4గా నమోదైంది&period; గంట వ్యవధిలో నాలుగుసార్లు కంపించింది భూమి&period; భూకంపం తీవ్రతకు భారీ భవనాలు కూడా షేకయ్యాయి&period; చియాపాస్ తీరానికి సమీపంలోని అఖిలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశగా 48 కిలోమీటర్ల దూరంలో&comma; భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు&period; ఈ ప్రధాన భూకంపానికి ముందు సముద్ర గర్భంలో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>భూకంప తీవ్రతకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు&period; మెక్సికో&comma; గ్వాటెమాలా సరిహద్దుల్లోని సుచియాటే నగరంలో సునామీ ముప్పు పొంచి ఉందనే అనుమానంతో తీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు&period; మెక్సికో దక్షిణ సరిహద్దులోని కీలక నగరమైన టపచులాలో తొలుత స్వల్పంగా ప్రారంభమైన ప్రకంపనలు&comma; కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చాయి&period; ఇర గ్వాటెమాలా సిటీలో భూప్రకంపనలు దీర్ఘకాలం పాటు కొనసాగడంతో జనం ఆందోళన చెందారు&period; మెక్సికో సిటీలోని పలు ప్రాంతాల్లో భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి&period; అయితే&comma; భూకంపం సంభవించిన ప్రారంభ క్షణాల్లో దాని తీవ్రత నిర్దేశిత పరిమితిని మించకపోవడంతో ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ మోగలేదని తెలిపింది ప్రభుత్వం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.