విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం.

విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం

Advertisements

<p>విజయవాడను డయేరియా వణికిస్తోంది&period; గిరిపురంలో వారం రోజులుగా అతిసారం కలకలం రేపుతోంది&period; చిన్నారులు&comma; పెద్దలు వాంతులు విరోచనాలతో విలవిలలాడుతున్నారు&period; వర్షాకాలం వచ్చిందంటే విజయవాడలో డయేరియా ప్రబలటం నిత్యకృత్యమైంది&period; ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలం చెందుతున్నారు&period; నల్లాల్లో అపరిశుభ్రమైన నీరు వస్తుందని గిరిపురంవాసలు వెల్లడించారు&period; పైప్ లైన్ లీకేజీల వల్ల నీరు కలుషితం అవుతుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు వెల్లడించారు&period; డయేరియా పీఢితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు&period;విజయవాడలో వర్షకాలంలో డయేరియా ప్రబలటం కొత్తేమి కాదు&period; గతంలో మొగల్రాజపురం&comma; రాజరాజేశ్వరిపేటలోనూ డయేరియా ప్రబలి రెండేళ్లలో 15 మంది చనిపోయారు&period; విజయవాడలో ఏటా పరిస్థతి ఇంత తీవ్రంగా తలెత్తుతున్నా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలేదు&period; డయేరియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు గిరిపురంలో శిబిరాలు ఏర్పాటు ఏశారు&period; ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించి పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; గిరిపురంలో డయేరియా ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించి బాధితులను పరామర్శించారు&period; ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.