హాట్ టాపిక్ గా మారిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..

హాట్ టాపిక్ గా మారిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి&period; ఇజ్రాయెల్‌లో తనకు విశేష ప్రజాదరణ ఉందని&comma; భవిష్యత్తులో అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసే అవకాశం ఉందంటూ ఆయన చమత్కరించారు&period; మరోవైపు&comma; ఇజ్రాయెల్‌లో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది&period;<br &sol;>&NewLine;ఇజ్రాయెల్ రాజకీయాలపై ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు&period;ఇజ్రాయెల్‌లో తనకు 99 శాతం అప్రూవల్ రేటింగ్ ఉందంటూ తెలిపారు&period; అమెరికాలో పదవీ కాలం ముగిశాక&comma; ఇజ్రాయెల్ లో ప్రధాని పదవికి పోటీ చేయవచ్చేమో&excl;’ అని ఆయన నవ్వుతూ అన్నారు&period; అలాగే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చాలా మంచి వ్యక్తిగా ఆయన అభివర్ణించారు&period; ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలోనే&comma; ఇజ్రాయెల్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నదని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది&period; గత 17 ఏళ్లలో ఎక్కువ భాగం అధికారంలో ఉన్న నెతన్యాహుకు ఇప్పుడు సొంత కూటమి నుంచే సెగ తగులుతోంది&period; సైనిక నియామక మినహాయింపుల విషయంలో నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక మిత్రపక్షమైన &OpenCurlyQuote;అల్ట్రా-ఆర్థోడాక్స్’ మతపరమైన పార్టీలు మద్దతు ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి&period; ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దుకు ఉద్దేశించిన ప్రాథమిక బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది&period; అక్టోబర్ 7&comma; 2023 నాటి హమాస్ దాడుల తర్వాత భద్రతా వైఫల్యాలపై నెతన్యాహు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు&period; దీనికి తోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయనకు అతిపెద్ద ముప్పుగా మారాయి&period; ఈ బిల్లుకు పూర్తి ఆమోదం లభిస్తే&comma; ఈ ఏడాది చివర్లో ఇజ్రాయెల్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..