సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం..

సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

Advertisements

<p>ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది&period; దేశీయంగా తయారు చేసిన సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది&period; ఈ రాకెట్ వ్యవస్థను ప్రైవేట్‌ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసింది&period; ఒడిశాలోని చాందీపుర్‌ పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు&period; 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో రూపొందించిన రెండు రకాల సూర్యాస్త్ర రాకెట్‌ నమూనాలను పరీక్షించారు&period; ఈ పరీక్షల్లో రాకెట్లు లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో తాకినట్లు అధికారులు వెల్లడించారు&period; కేవలం 1&period;5 నుంచి 2 మీటర్ల పరిధిలోనే లక్ష్యాన్ని ఛేదించడం ఈ వ్యవస్థ ప్రత్యేకతగా పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>150 కిలోమీటర్ల శ్రేణి వేరియంట్ యుద్ధరంగంలో తక్షణ రక్షణ మద్దతుకు&comma; శత్రు స్థావరాలపై వ్యూహాత్మక దాడులకు ఉపయోగపడుతుంది&period; ఇక300 కిలోమీటర్ల శ్రేణి వేరియంట్ సైన్యానికి స్టాండ్-ఆఫ్ సామర్థ్యాన్ని అందిస్తుంది&period; అంటే మన సైనికులు సురక్షిత ప్రాంతంలో ఉంటూనే&comma; శత్రు సరిహద్దుల వెనుక చాలా లోతున ఉన్న వ్యూహాత్మక కేంద్రాలను ధ్వంసం చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p>ఈ విజయవంతమైన ప్రయోగాలతో ఈ రాకెట్ వ్యవస్థ త్వరలోనే భారత సైన్యం అమ్ములపొదిలో అధికారికంగా చేరనుంది&period; గతంలో ఇటువంటి అధునాతన క్షిపణి&comma; రాకెట్ వ్యవస్థల కోసం భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేది&period; కానీ&comma; ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహిస్తుండటంతో&comma; DRDO వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు నిబే లిమిటెడ్ వంటి ప్రైవేట్ రక్షణ సంస్థలు కూడా అత్యాధునిక ఆయుధాలను ఇక్కడే తయారు చేస్తున్నాయి&period; ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశీయ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతికి&comma; స్వయం సమృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..