iQOO Z9 5G price in India : ఐకూ జెడ్9 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇటీవలే లాంచ్ అయిన రియల్మీ 12, రియల్మీ 12+ లతో పాటు లాంచ్‌కు రెడీ అవుతున్న పోకో ఎక్స్ 6 నియో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
iQoo Z9 5G మార్కెట్ ధర ఎంతంటే..?
ఐక్యూ జెడ్9 5జీ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర 19,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 21,999గా నిర్ణయించింది. బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. ఈ ఐక్యూ ఫస్ట్ సేల్(iQOO First Sale) మార్చి 13 మధ్యాహ్నం 12:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులందరికీ మార్చి 14 నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు అమెజాన్ ఇండియా, ఐక్యూ ఇండియా స్టోర్(iQOO India Store), ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు రూ. 2వేలు తగ్గింపు అందిస్తుంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వెర్షన్‌ల ధరను వరుసగా రూ. 17,999 రూ. 19,999కు కొనుగోలు చేయొచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
iQOO Z9 5G launch date in India
ఈ కొత్త ఫోన్ మంగళవారం (మార్చి 12) దేశ మార్కెట్లో లాంచ్ అయింది. లేటెస్ట్ ఈ ఐక్యూ Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ ద్వారా ఐకూ జెడ్9 5జీ అందుబాటులోకి రానుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 67.78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ :
ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ఐక్యూ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 67.78 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. అలాగే, 17 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లోని ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 31 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతానికి వేగంగా ఛార్జ్ చేయగలదు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి